Best Camera Phones: తక్కువ ధరలో బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. మీ జ్ఞాపకం ఎప్పటికీ పదిలం..

|

Sep 23, 2024 | 2:53 PM

గతంలో ఫోన్ అంటే కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే వాడేవారు. స్మార్ట్ ఫోన్ వచ్చాక దాని సేవలు మరింత పెరిగాయి. ప్రతి పనికీ అత్యంత అవసరంగా మారింది. ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, ఆర్థిక లావాదేవీలు, షాపింగ్; ఫొటోలు.. ఇలా పనిదానికీ ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో సరికొత్త సాంకేతికతతో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఫీచర్లలో కెమెరా నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజల అవసరానికి అనుగుణంగా అత్యుత్తమ కెమెరాలతో ఫోన్లు విడుదలవుతున్నాయి. మనకు నచ్చిన చోట ఫొటోలు, వీడియోలు తీసుకోవడం, తక్కువ లైటింగ్ లోనూ స్పష్టమైన ఫొటోలు తీయడం వీటి ప్రత్యేకత. ఈ నేపథ్యంలో అత్యుత్తమ కెమెరాలు కలిగిన రూ.20వేల ధరలలో లభిస్తున్న స్మార్ట్ ఫోన్లు గురించి తెలుసుకుందాం.

1 / 5
మోటో జీ64.. మోటో జీ64 లో క్వాడ్ పిక్సల్ టెక్నాలజీ, 50 ఎంపీ కెమెరా సెన్సార్, 16 ఎంపీ సెల్పీ కెమెరా ఏర్పాటు చేశారు. 8ఎంపీ ఆటోఫోకస్ సెన్సార్, మాక్రో విజన్ టెక్నాలజీ తో రాత్రి, పగటి సమయంలోనూ ఫొటోలను స్పష్టంగా తీసుకునే అవకాశం ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ అక్టా కోర్ ప్రాసెసర్, 6000 ఏఎంహెచ్ బ్యాటరీ, 6.5 డిస్ ప్లే అదనపు ప్రత్యేకతలు. ఈ ఫోన్ అమెజాన్ లో రూ.15,919కు అందుబాటులో ఉంది.

2 / 5
పోకో ఎక్స్ 6.. దీనిలోని సాఫ్ట్ వేర్ టెక్నాలజీ, ఏఐ టెక్నిక్ తో ఫొటోలు చాలా స్పష్టంగా తీసుకోవచ్చు. ట్రిపుల్ కెమెరా సిస్టమ్ లో 64 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపీ మైక్రో కెమెరా ఏర్పాటు చేశారు. స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్2 ప్రాసెసర్, 5100 బ్యాటరీ కలిగిన ఈ 4కె కెమెరా స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో రూ.18,499కి లభిస్తుంది.

3 / 5
రియల్ మీ నార్జో 70 ప్రో.. బెస్ట్ కెమెరా సెన్సార్లు, సింగిల్ పిక్సల్ ఫొటో సెన్సిటివీటీతో తక్కువ కాంతిలోనూ మెరుగైన ఫొటోలు తీసుకోవచ్చు. డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 16 ఎంపీ సెల్పీ కెమెరా అదనపు ప్రత్యేకతలు. అమెజాన్ లో రియల్ మీ నార్జో 70 ప్రో రూ.17,998కి అందుబాటులో ఉంది.

4 / 5
వన్ ప్లస్ నోర్డ్ సీఈ 4 లైట్.. సరైన ఆకారంలో, మంచి స్పష్టతతో ఫొటోలు తీసుకునేందుకు ఈ ఫోన్ లో 50 ఎంపీ సోనీ ఎల్వైటీ 600 కెమెరా ఏర్పాటు చేశారు. 2 ఎక్స్ ఇన్ సెన్సార్ జూమ్ ఆబ్జెట్, బోకె ఎఫెక్ట్ తో కూడిన పోర్ట్రెయిట్ మోడ్, స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్, ఏఐ స్టార్ట్ కటౌట్, 5200 ఏఎంహెచ్ బ్యాటరీ అదనపు ప్రత్యేకతలు. ఈ ఫోన్ అమెజాన్ లో రూ.19,998కి అందుబాటులో ఉంది.

5 / 5
రియల్ మీ 13 ప్లస్.. క్రిస్టల్ క్లియర్ షాట్ ల కోసం రియల్ మీ 13 ప్లస్ స్మార్ట్ ఫోన్ లోొ అదనపు పెద్ద సెన్సార్లు ఉన్నాయి. ఎలాంటి వాతావరణంలోనైనా ఫొటోలు స్పష్టంగా వస్తాయి. ప్రో లెవెల్ కెమెరా ఫీచర్లు, డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్, 5000 ఏఎంహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. అమెజాన్ లో ఈ ఫోన్ రూ.18,998కి అందుబాటులో ఉంది.