Gaming Phones: యువతను వెర్రెక్కించే గేమింగ్‌ ఫోన్లు ఇవే.. తక్కువ ధరకే మతిపోయే ఫీచర్లు..!

| Edited By: Ravi Kiran

Nov 10, 2023 | 7:46 PM

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా యువత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గతంలో కేవలం ఫోన్‌ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించే ఫోన్లు ఇప్పుడు ప్రతి అవసరానికి ఫోన్లు తప్పనిసరయ్యాయి. ముఖ్యంగా తక్కువ ధరకే అధిక ఫీచర్లు వచ్చే ఫోన్లను ఇష్టపడుతున్నారు. భారతదేశంలో మధ్య తరగతి జనాభా ఎక్కువ కాబట్టి రూ.20 వేల లోపు స్మార్ట్‌ఫోన్లను గేమింగ్‌ కోసం వాడుతున్నారు. కాబట్టి రూ. 20 వేల లోపు దొరికే బెస్ట్‌ ఫోన్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

1 / 5
బలమైన, స్టైలిష్ డిజైన్‌తో పని చేసే రియల్‌మీ నార్జో 50 5జీ ఫోన్‌ మీ అన్ని గేమింగ్ అవసరాలకు సరైన పరిష్కారంగా ఉంటుంది. మీడియా టెక్‌ డైమెన్సిటీ 810 5జీ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫుల్‌ స్పీడ్‌ రన్నింగ్‌తో పాటు తక్కువ శక్తిని వినియోగిస్తుంది. 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పని చేసే ఈ ఫోన్‌ 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పని చేస్తుంది. ఈ ఫోన్‌ ధర రూ.15,9997గా ఉంది.

2 / 5
రెడ్‌మీ నోట్‌ 11టీ 5జీ ఫోన్‌ రూ.11,999కు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో రీడింగ్ మోడ్, సన్‌లైట్ డిస్‌ప్లే, 240 హెచ్‌జెడ్‌ టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. 6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్తేతో వచ్చే ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పని చేస్తుంది. ఈ ఫోన్‌లో కూడా 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది.

3 / 5
వివో టీ 2 ఎక్స్‌ ఫోన్‌ రూ.15985కు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ 7 ఎన్‌ఎం 5జీ చిప్ ఆక్టా-కోర్ డిమ్నెసిటీ 6020 ద్వారా పని చేస్తుంది. కాబట్టి ఆన్‌లైన్ వీడియోలను చూస్తున్నప్పుడు లేదా గేమ్‌లు ఆడుతున్నప్పుడు వినియోగదారుడికి మంచి అనుభవాన్ని ఇస్తుంది. 6.58 అంగుళాల డిస్‌ప్లేతో పని చేసే ఈ ఫోన్‌ 4 జీబీ +128 జీబీ, 6 జీబీ + 128 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వచ్చే ఈ ఫోన్‌లో కూడా 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది.

4 / 5
రియల్‌ మీ 11 ఎక్స్‌ రూ.15,080కు అందుబాటులో ఉంటుంటు 5000mAh భారీ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్‌ కచ్చితంగా గేమింగ్‌ ప్రియులను ఆకట్టుకుంటుంది.  6.72 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100 ప్లస్‌ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పని చేస్తుంది.

5 / 5
వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 లైట్‌ ఫోన్‌ ప్రస్తుతం రూ.19,999కు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా గేమింగ్‌ ప్రియులను ఈ ఫోన్‌ అమితంగా ఆకట్టుకుంటుంది. సూపర్‌ వూక్‌ చార్జర్‌కు సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌ వేగంగా చార్జ్‌ అవుతుంది. అలాగే బ్యాటరీ లైఫ్‌ను కూడా పెంచుతుంది. 6.72 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతో స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పని చేస్తుంది. ముఖ్యంగా 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వచ్చే ఈ ఫోన్‌ ఫొటో లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది.