Laptops Under 25k: ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. కేవలం రూ. 25వేల లోపు ధరలో బెస్ట్ ల్యాప్ టాప్స్ ఇవే..

|

Apr 10, 2024 | 3:52 PM

పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. ప్రజల అవసరాలకు తగినట్టుగా వివిధ రకాల ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నేడు ప్రతి ఒక్కరికీ కనీస అవసరంగా మారిన ల్యాప్ టాప్ లు వివిధ రకాల మోడళ్లతో కనువిందు చేస్తున్నాయి. లేటెస్ట్ ఫీచర్లతో పాటు ధర సామాన్యులకు అందుబాటులో ఉండటం వీటి ప్రత్యేకత. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాలకూ ఉపయోగపడేలా వీటిని రూపొందించారు. ఆఫీసు పనితో పాటు గేమింట్, వినోదం తదితర వాటికి చక్కగా ఉపయోగపడతాయి. కేవలం రూ.25 వేల లోపు ధరకు అమెజాన్ లో లభించే ల్యాప్ టాప్ వివరాలు తెలుసుకుందాం.

1 / 5
చువీ హీరో బుక్ ప్లస్(Chuwi HeroBook Plus).. 15.6 అంగుళాల ఈ ఫుల్ హెచ్‌డీ ల్యాప్ టాప్ లో ఇంటెల్ సెలెరాన్ ఎన్4020 డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ ఉంది. 2.80 జీహెచ్ జెడ్ వేగం పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్ డీతో పాటు ఇంటెల్ యూహెచ్ డీ గ్రాఫిక్స్, విండో 11 ఉన్నాయి. క్రిస్ప్ విజువల్స్, వైఫై 6, బ్లూటూత్ 5.2 తదితర ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. హెచ్ డీఎమ్ఐతో సహా అవసరమైన పోర్ట్‌లు ఉన్నాయి. అందుబాటు ధర, తేలికపాటి డిజైన్ దీని ప్రత్యేకతలు. అయితే పరిమిత గేమింగ్, తక్కువ బ్యాటరీ బ్యాకప్ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. ఈ ల్యాప్ టాప్ రూ.19,990 కు అందుబాటులో ఉంది.

2 / 5
చువీ హీరో బుక్ ప్రో(Chuwi HeroBook Pro).. ఇంటెల్ సెలెరాన్ ఎన్4020 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్ డీతో చూవీ హీరోబుక్ ప్రో ల్యాప్ టాప్ ఆకట్టుకుంటుంది. విండోస్ 11 తో పాటు 1టీబీ వరకూ డేటాను విస్తరించుకోవచ్చు. అల్ట్రా-స్లిమ్ డిజైన్‌తో పూర్తి హెడ్ డీ ఐపీఎస్ డిస్‌ప్లేతో ఆకట్టుకుంటుంది. అదనంగా యూఎస్బీ 3.0, మినీ హెచ్ డీఎమ్ఐ పోర్టులు ఉన్నాయి. అనేక ప్రయోజనాలు కలిగిన ఈ 14.1 అంగుళాల ల్యాప్‌టాప్ రూ.16,990కి లభిస్తుంది. వెబ్‌క్యామ్, పూర్తి హెచ్ డీ ఐపీఎష్ డిస్ ప్లే దీని ప్రత్యేకతలు.

3 / 5
అసుస్ వివో బుక్ 15(ASUS VivoBook 15).. తేలికైన, అందమైన ఈ ల్యాప్ టాప్ తో మన రోజు వారీ పనులను చక్కగా చేసుకోవచ్చు. 15.6 అంగుళాల హెచ్ డీ డిస్‌ప్లే, డ్యూయల్-కోర్ ఇంటెల్ సెలెరాన్ ఎన్4020 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్ డీ తో ఆకట్టుకుంటుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, విండోస్ 11 హోమ్‌తో యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. దీని బరువు కేవలం 1.8 కేజీలు. ప్రయాణంలో ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే 4 జీబీ ర్యామ్, ప్రాథమిక ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కారణంగా కొందరు ఇష్టపడకపోవచ్చు. దీని ధర రూ. 20,990.

4 / 5
ఎక్నో మెగాబుక్ టీ1( ECNO MEGABOOK T1).. అనేక విధాలుగా ఉపయోగపడే ల్యాప్ టాప్ ఇది. 11వ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ తో పాటు 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజీ కారణంగా మెరుగైన పనితీరు, మల్టీమీడియా ఫైళ్లకు తగినంత స్థలం ఉంటుంది. 15.6 అంగుళాల ఐ కంఫర్ట్ డిస్‌ప్లే తో చాలా స్పష్టంగా చూడవచ్చు. 14.8 ఎంఎం అల్ట్రా స్లిమ్ డిజైన్, 70 డబ్ల్యూహెచ్ బ్యాటరీ, విండోస్ 11 దీని ప్రత్యేకతలు. కేవలం 1.56 కేజీల బరువుతో మూన్‌షైన్ సిల్వర్‌ కలర్ లో అందుబాటులో ఉంది. స్టైల్, కంఫర్ట్ తో ఆకట్టుకుంటున్న ఈ ల్యాప్ టాప్ ధర రూ. 23,990.

5 / 5
క్రోమ్ బుక్ ఎక్స్360(Chromebook X360).. క్రోమ్ బుక్ ఎక్స్360 ల్యాప్ టాప్ లో ఇంటెల్ సెలిరాన్ ఎన్4120 ప్రాసెసర్, 14 అంగుళాల హెచ్ డీ డిస్‌ప్లే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని సన్నని, తేలికైన డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. కేవలం 1.49 కేజీల బరువుతో క్రోమ్ వైట్‌లో అందుబాటులో ఉంది. పని, వినోదం రెండింటి కోసం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మల్టీమీడియా కోసం ఇంటెల్ యూహెచ్ డీ గ్రాఫిక్స్, డ్యూయల్ స్పీకర్ల ఉన్నాయి. అయితే 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మాత్రమే ఉండడం కొంచె ప్రతికూలం. ఈ ల్యాప్ టాప్ ధర రూ. 24,990.