
టెక్నో స్పార్క్ 9టీ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేసింది. రూ. 9,299కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డాట్ నాచ్ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఫ్రంట్ కెమెరాకు ఫ్లాష్ లైట్ ఉండడం విశేషం.

మీడియా టెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో డీటీఎస్ సరౌండ్ సౌండ్‌ను అందించారు. రెండు కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈఫోన్‌పై నో కాస్ట్ ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను అందించారు. అలాగే పాత ఫోన్ ఎక్సైంజ్‌పై రూ. 8,800 వరకు తగ్గింపు పొందొచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో 10 శాతం డిస్కౌట్ పొందొచ్చు.