
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ టెక్నో ఇటీవల భారత మార్కెట్లోకి టెక్నో స్పార్క్ 20 సీపేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ సేల్స్ తాజాగా మార్చి 5వ తేదీ నుంచి అమెజాన్‌లో ప్రారంభమయ్యాయి.

టెక్నో స్పార్క్ 20సీ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,999కాగా, లాచింగ్ ఆఫర్లో భాగంగా రూ. 7,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

అలాగే ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై రూ.5,604 విలువైన ఓటీటీ ప్లే వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ స్క్రీన్ అందించారు.

రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ ఈ డిస్‌ప్లే సొంతం. యాపిల్ డైనమిక్ ఐల్యాండ్ తరహాలో ఇందులో డైనమిక్ పోర్టు అందించారు. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఇందులో చూసుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 18 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. కేవలం 50 నిమిషాల్లోనే 0 నుంచి 50 శాతం వరకు ఛార్జింగ్ అవుతుంది.