
టెక్నో కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. టెక్నో పోవా 5 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఆగస్టు 15 నుంచి ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది.

టెక్నో పోవా 5లో 6.78 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ పంచ్ హోల్ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెస్ రేట్ ఈ స్క్రీన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

మీడియా టెక్ హీలియో జీ99 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్ డ్యూయల్ సెటప్‌తో కూడిన రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో బ్యాటరీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 45 వాట్స్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ధరను ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు.