
ప్రస్తుతం ట్యాబ్లెట్లకు డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో టీసీఎల్ కంపెనీ కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. టీసీఎల్ ట్యాబ్ 10 పేరుతో లాంచ్ చేసిన ఈ ట్యాబ్లెట్‌లో ఆకట్టుకునే ఫీచర్లను అందించారు.

5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసే టీసీఎల్ ట్యాబ్ 10లో 1920×1200 పిక్సెల్ రిజొల్యూసన్‌తో కూడిన 10.1 ఇంచెస్ హెచ్‌డీ + డిస్‌ప్లేను అందించారు. 60 హెర్ట్జ్ రీష్రెష్ రేట్ ఈ డిస్‌ప్లే సొంతం.

ఆక్టాకోర్ మీడియా టెక్ కొంపానియో 800 టీ చిప్‌సెట్‌తో పని చేసే ఈ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లో డ్యూయల్ స్పీకర్ సెటప్‌ను అందించారు. అంతేకాకుండా 8000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఇచ్చారు.

ధర విషయానికొస్తే భారత మార్కెట్లో రూ. 23,868గా ఉండనుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 32 స్టోరేజ్‌ను అందించారు. ఎస్టీ కార్డుతో స్టోరేజ్‌ని 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ట్యాబ్లెట్‌లో 8 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్పీల కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.