2 / 5
ఎలైట్ బ్లాక్‌లో కలర్‌లో అందుబాటులో ఉండే నాయిస్ హాలో ప్లస్ స్మార్ట్‌వాచ్ 1.46 అంగుళాల సూపర్ ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్ సమయం, నోటిఫికేషన్‌లు ఎల్లప్పుడూ కనిపించేలా చేస్తుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ బిల్డ్‌తో నాయిస్ హాలో ప్లస్ ఆకట్టుకునే బ్యాటరీ లైఫ్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. అలాగే ఓ సారి చార్జ్ చేస్తే 7 రోజుల బ్యాటరీ లైఫ్ ఈ స్మార్ట్ వాచ్ సొంతం. అంతేకాకుండా ఏఐ వాయిస్ అసిస్టెంట్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లతో పాటు 100 స్పోర్ట్స్ మోడ్‌లతో ఈ స్మార్ట్ అందరినీ ఆకర్షిస్తుంది.