Best tabs: చిన్న పరిమాణం.. పనితీరు బ్రహ్మాండం..అమెజాన్ లో తక్కువ ధరకే బెస్ట్ ట్యాబ్‌లు

Updated on: Mar 01, 2025 | 3:45 PM

ఆధునిక కాలంలో ట్యాబ్ ల వినియోగం విపరీతంగా పెరిగింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా అన్ని తరగతుల ప్రజలూ ఎక్కువగా వినియోగిస్తున్నారు. పీసీలను ఇంటికి నుంచి బయటకు తీసుకువెళ్లలేం. ల్యాప్ టాప్ లు పెద్దసైజులో ఉండడంతో వెంట తీసుకువెళ్లడం కష్టం. దీంతో వాటి కన్నా తక్కువ సైజులో ఉండే ట్యాబ్లెట్లకు డిమాండ్ పెరిగింది. చదువు, వినోదం, అధ్యయనం, సినిమాలు, టీవీషోలు, గేమింగ్ తదితర అన్ని అవసరాలకు ఇవి చక్కగా ఉపయోగపడతాయి. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ లో ఆపిల్, సామ్సంగ్, లెనోవా, షియోమి తదితర బ్రాండ్లకు చెందిన ట్యాబ్ లు అందుబాటులో ఉన్నాయి. వాటి ధర, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.

1 / 5
పని, వినోదం రెండింటికీ ఆపిల్ ఐప్యాడ్ చక్కగా సరిపోతుంది. దీనిలోని 10.9 అంగుళాల పెద్ద స్క్రీన్ పై ప్రతి విషయం స్పష్టంగా కనిపిస్తుంది. లిక్విడ్ రెటినా డిస్ ప్లేతో కంటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏ14 బయోనిక్ చిప్ తో ఐప్యాడ్ పనితీరు చాలా వేగంగా ఉంటుంది. 481 గ్రాముల బరువు, 64 జీబీ స్టోరేజీ సామర్జ్యం, వీడియో కాల్స్ కోసం 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 12 ఎంపీ బ్యాక్ కెమెరా, రోజంతా పనిచేేసే బ్యాటరీ, అదనపు భద్రత కోసం అంతర్నిర్మిత టచ్ ఐడీ అదనపు  ప్రత్యేకతలు. ఆపిల్ ఐప్యాడ్ (10 జెన్)ను అమెజాన్ లో రూ.49,490కు కొనుగోలు చేయవచ్చు.

2 / 5
సరికొత్త టాబ్లెట్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇన్ బిల్ట్ స్టాండ్ డిజైన్ కలిగిన లెనోవా ట్యాబ్ ప్లస్ చాలా ఉపయోగంగా ఉంటుంది. 2కే రిజల్యూషన్, 90 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటు, 11.5 అంగుళాల స్క్రీన్, 8600 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 45 డబ్ల్యూ ఫాస్ట్ చార్జర్ తో వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. మీడియాటెక్ హేలియా జీ99 ఆల్టా ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ప్లాట్ ఫాం, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1.12 కిలోల బరువుతో పనితీరు బ్రహ్మాండంగా ఉంటుంది.  అమెజాన్ లో రూ.21,990కి అందుబాటులో ఈ ట్యాబ్లెట్ ఉంది.

3 / 5
పనితో పాటు గేమింగ్ ఆడుకునేవారికి షియోమి ప్యాడ్ 6 మంచి ఎంపిక. స్నాప్ డ్రాగన్ 870 ఆక్టా కోర్ ప్రాసెసర్, హైపర్ ఓఎస్ ప్లాట్ ఫాంపై ఆధారపడి పనిచేస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం చక్కగా ఉపయోగపడుతుంది. 11 అంగుళాల స్క్రీన్ లో సినిమాలు, షోలు వీక్షించవచ్చు. ఆన్ లైన్ గేమ్ లు చక్కగా ఆడుకోవచ్చు. రెండు రోజులు పనిచేసే బ్యాటరీ, 1.07 కిలోల బరువైన ఈ టాబ్లెట్ అమెజాన్ లో అందుబాటులో ఉంది.

4 / 5
పని, వినోదం, కమ్యూనికేషన్ అవసరాలను తీర్చడానికి వన్ ప్లస్ ప్యాడ్ గో చక్కగా సరిపోతుంది. హైస్పీడ్ వైఫై కనెక్షన్, 4జీ ఎల్ టీఈ సెల్యూలార్ కనెక్టివిటీ దీని ప్రత్యేకతలు. 11.35 అంగుళాల స్క్రీన్ కారణంగా విద్యార్థులకు కూడా చదువుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. డాల్బీ అట్మాస్ సౌండ్ స్పీకర్లు, మీడియా టెక్ హెలియా జీ99 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ ఆక్సిజన్ ఓఎస్ 13.2పై పనిచేస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం లాగ్ ఫ్రీ పనితీరును అందిస్తుంది. 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో రోజంతా చార్జింగ్ సరిపోతుంది. 256 జీబీ స్టోరేజీ, 532 గ్రాముల బరువున్న వన్ ప్లస్ ప్యాడ్ 4జీ ఎల్ టీఈ ట్యాబ్ ను అమెజాన్ లో రూ.20,999కి కొనుగోలు చేయవచ్చు.

5 / 5
అత్యుత్తమ ఐప్యాడ్ లలో సామ్సంగ్ గెలాక్సీ ముందు వరుసలో ఉంటుంది. ప్రకాశవంతమైన 11 అంగుళాల డిస్ ప్లే, మంచి సామర్థ్యం కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఎస్ఎం6375 ప్రాసెసర్, 7040 ఎంఏహెచ్ బ్యాటరీతో పనితీరు చాలా బాగుంటుంది. ఫోన్ సిమ్ వేసుకుని, సెల్యులర్ నెట్ వర్క్ ఉపయోగించుకోవచ్చు. అలాగే అన్ని సమయాల్లో ఇంటర్నెట్ కు కనెక్ట్ అవ్వవచ్చు. 5 ఎంపీ ఫ్రంట్ ఫోకస్ కెమెరా, 8 ఎంపీ ఆటోఫోకస్ బ్యాక్ కెమెరా, 128 జీబీ స్టోరేజ్, 510 గ్రాముల బరువు కలిగిన సామ్సంగ్ గెలాక్సీ ఏ9ప్ల్ ట్యాబ్ అమెజాన్ లో కేవలం రూ.19,344కి అందుబాటులో ఉంది.