
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో చాలా కంపెనీలు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తిరిగి ప్రారంభించాయి. దీంతో చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు.

మొబైల్ డేటాతో స్పీడ్ సరిపోకపోవడంతో చాలా మంది బ్రాడ్‌బ్యాండ్‌లవైపు మొగ్గుచూపుతున్నారు. ఇంటర్నెట్ సంస్థలు కూడా ధరలు తగ్గించడంతో ఆ వైపు అడుగులు వేస్తున్నారు.

ప్రస్తుతం తక్కువ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్‌పై ఓ లుక్కేయండి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ 40Mbps స్పీడ్ ప్లాన్‌ను రూ. 499కి అందిస్తోంది. ఇక 100Mbps స్పీడ్ విషయానికొస్తే రూ. 799.

రియలన్స్ జియో 30Mbps స్పీడ్ ప్లాన్‌ను రూ.399కి అందిస్తుండగా.. 100Mbps స్పీడ్ రూ. 699కి అందిస్తోంది. 150 Mbps ప్లాన్‌కు రూ. 999గా నిర్ణయించారు.

బీఎస్ఎన్ఎల్ 30Mbps డేటా ఆఫర్‌ను రూ. 449కి అందిస్తోంది. ఇక 100Mbpsని రూ. 799కి అందిస్తోంది.

ACT బ్రాడ్‌బ్యాండ్ సంస్థ.. 40Mbps ప్లాన్‌ను రూ. 549కి అందిస్తోంది. ఇక రూ. 710కి 50Mbps ప్లాన్‌ను అందిస్తోంది.