Narender Vaitla |
Mar 07, 2023 | 4:31 PM
కంపెనీల మధ్య పెరుగుతోన్న పోటీ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా మిడ్ రేంజ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ కంపెనీలు కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా సౌత్ కొరియాకు చెందిన సామ్‌సంగ్ సైతం తక్కువ బడ్జెట్‌లో ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ14 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను 5జీ నెట్‌వర్క్ సపోర్ట్‌తో తీసుకొచ్చారు.
ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ప్రైవేట్ షేర్ ఫీచర్ అనే సరికొత్త ఫీచర్ ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. ఇక ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన పవర్ ఫుల్ బ్యాటరీని ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ మేనేజ్‌మెంట్ ఈ ఫోన్ ప్రత్యేకత.
ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,499 గా ఉంది. 6GB Ram - 128GB ఫోన్ వేరియంట్ ధర రూ. 18,999 గా ఉంది. 8జీబీ Ram ఫోన్ వేరియంట్ ధర రూ. 20,999 గా ఉంది.