ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ03 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్‌తో తీసుకొచ్చారు.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఇక ఇందులో ఆక్టా కోర్ 1.6 జీహెచ్‌జెడ్ ప్రాసెసర్‌ను ఇచ్చారు.
ఇక కెమెరాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. దీంతో పాటు 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియెంట్స్‌లలో తీసుకొచ్చారు. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ రూ. 10,499.. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను రూ. 11,999గా ఉంది.
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, రెండ్ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.