ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్. దేశంలో ఒక టెలికాం విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత ఈ సంస్థదే అని చెప్పొచ్చు. నగర, పట్టణాలతో పాటు ఇంటర్నెట్ ను గ్రామీణ స్థాయికి చేర్చి.. డిజిటల్ ఇండియా స్వప్నంలో కీలకంగా వ్యవహించింది. ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ జియో నడుస్తోంది. అయితే ఇటీవల అన్ని టెలికం కంపెనీలు తన ప్రీపెయిడ్ ప్లాన్ల ట్యారిఫ్ లను పెంచాయి. అందులో భాగంగా జియో కూడా తన ప్లాన్ల ధరలను పెంచింది. అలాగే ప్రసిద్ధ ఓటీటీ ప్లాట్ ఫారంలు అయిన నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి వాటికి యాక్సెస్ ఇచ్చిన ప్లాన్లను సైతం నిలిపివేశాయి. అయినప్పటికీ కొన్ని ప్లాన్లు సరసమైన ధరకే వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి..