Jio: యూజర్లకు జియో న్యూ ఇయర్‌ ఆఫర్‌.. అదనంగా వ్యాలిడిటీ..

|

Dec 25, 2023 | 5:43 PM

కొత్తేడాదికి గ్రాండ్‌గా వెల్‌ కమ్‌ చెప్పేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే న్యూ ఇయర్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డాయి కంపెనీలు. ఇందులో భాగంగానే రకరకాల ఆఫర్లను అందిస్తూ యూజర్లను అట్రాక్ట్‌ చేస్తున్నాయి. తాజాగా రియలన్స్‌ జియో సైతం యూజర్లకోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. హ్యాపీ న్యూ ఇయర్‌ 2024 పేరుతో మంచి ఆఫర్‌ను తీసుకొచ్చింది..

1 / 5
ప్రముఖ టెలికం సంస్థ రియలన్స్‌ జియో కొత్తేడాది కానుకగా ఓ బంపరాఫర్‌ను ప్రకటించింది. 'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ 2024' పేరుతో యూజర్లకు అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. జియో ఈ ఆఫర్‌ను ఇప్పటికే యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

2 / 5
 లాంగ్‌ టర్మ ప్లాన్స్‌ వారికి ఈ ఆఫర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణంగా రూ. 2999 ప్రీపెయిడ్‌ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 365 రోజులు వ్యాలిడిటీ వచ్చేది. అయితే ఇప్పుడు దీనికి అదనపు వ్యాలిడిటీని అందించనున్నారు.

3 / 5
జియో తీసుకొచ్చిన న్యూ ఇయర్‌ ఆఫర్‌లో భాగంగా ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకున్న వారికి 24 రోజులు అదనంగా వ్యాలిడిటీ లభించనుంది. అంటే మొత్తం 389 రోజులు ఈ ప్లాన్‌ బెనిఫిట్స్‌ పొందొచ్చు.

4 / 5
రూ. 2,999తో రీఛార్జ్‌ చేసుకున్న వారికి అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ లభిస్తాయి. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు, రోజుకు 2.5 జీబీ డేటా పొందొచ్చు. ఈ లెక్కన మొత్తం 912 జీబీ డేటా పొందొచ్చు.

5 / 5
అలాగే ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకున్న వారికి అదనంగా జియో క్లౌడ్‌, జియో టీవీ, జియో సినిమా వంటి వాటిని ఉచితంగా పొందొచ్చు. ఈ లెక్కన ఈ రీఛార్జ్‌ ప్లాన్‌తో యూజర్లకు రోజుకు కేవలం రూ. 7.70 చెల్లించాల్సి ఉంటుంది.