Redmi Note 13 Pro: సరికొత్త కలర్‌లో రెడ్‌మీ నోట్‌ 13 ప్రో.. ధర కూడా తక్కువే..

|

Jun 22, 2024 | 10:25 AM

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్స్‌ కలర్స్‌కు యూజర్లు పెద్ద పీట వేస్తున్నారు. నచ్చిన కలర్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆశిస్తున్నారు. దీంతో వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగానే కంపెనీలు సైతం రకరకాల కలర్స్‌లో ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ఫోన్‌ను కొత్త కలర్‌ వేరియంట్‌లో తీసుకొచ్చింది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ రెడ్‌మీ నోట్‌ 13 ప్రో 5జీ ఫోన్‌ గత జనవరిలో భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. లాంచింగ్ సమయంలో ఈ ఫోన్‌ను అరోరా పర్పుల్‌, మిడ్‌నైట్ బ్లాక్‌, ఓషన్‌ టీల్‌ కలర్స్‌లో తీసుకొచ్చారు. అయితే తాజాగా ఆలీవ్‌ గ్రీన్‌ కలర్‌లో కూడా లాంచ్‌ చేశారు.

2 / 5
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త కలర్‌ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 24,999కాగా, 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 26,999, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 28,999కి లభిస్తోంది.

3 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన 1.5 కే రిజల్యూషన్‌ కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌ను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ ఈ స్క్రీన్ సొంతం.

4 / 5
ఇక ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఎంఐయూఐ 14 ఓఎస్‌ను అందించారు. కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)కు సపోర్ట్‌ చేసే 200 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 67 వాట్స్‌ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5100 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. అలాగే కనెక్టివిటీ కోసం 5జీ, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, బ్లూ టూత్ 5.2, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్లను ఇచ్చారు. ఐపీ54 రేటింగ్‌తో కూడిన డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్‌ను ఇచ్చారు.