చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. రెడ్‌మీ నోట్ 13 సిరీస్‌లో భాగంగా మొత్తం మూడు ఫోన్‌లను తీసుకురానున్నారు. జనవరి 4వ తేదీన ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. రెడ్‌మీ నోట్ 13, రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో+ ఫోన్‌లను లాంచ్ చేయనున్నారు.
ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 1.5కే రిజల్యూషన్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్ స్క్రీన్‌ను అందించారు. ప్రో+ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌లో కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించనున్నారు.
రెడ్‌మీ నోట్ 13 స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇక 13 ప్రో ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్2, నోట్ 13ప్రో+లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇస్తారు.
ఇక కెమెరా విషయానికొస్తే రెడ్‌మీ నోట్ 13 స్మార్ట్ ఫోన్‌లో 100 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారు.
రెడ్‌మీ నోట్ 13 ప్రో స్మార్ట్ ఫోన్‌లో సామ్‌సంగ్ హెచ్‌పీ3 సెసన్సర్‌తో కూడిన 200 మెగాపిక్సెల్స్ కెమెరాను అందించనున్నారు. ఇక ధర విషయానికొస్తే.. రెడ్‌మీ నోట్ 13 బేసిక్ వేరియంట్ ధర రూ. 14,000, రెడ్‌మీ నోట్ 13 ప్రో రూ. 17,600, రెడ్‌మీ నోట్ ప్రో+ స్మార్ట్ ఫోన్ ధర రూ. 23,500గా నిర్ణయించారు.