
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం రెడ్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. రెడ్‌మీ నోట్ 11టీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను ఆకట్టుకునే ఫీచర్లతో తీసుకొచ్చారు.

ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. అంతేకాకుండా మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఈ ఫోన్ సొంతం.

కెమెరాకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇక 33 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 16,999, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999 కాగా, 8 జీబీ ర్యామ్, 128 స్టోరేజ్ ధర రూ. 19,999కి అందుబాటులో ఉంది.

డిసెంబర్ 7 మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ అమెజాన్‌తో పాటు ఎమ్‌ఐ స్టోర్‌లలో అందుబాటులోకి రానుంది. ఐసీఐసీఐ డెబిట్, క్రెడిక్ కార్డుతో కొనుగోలు చేసే వారుకు రూ. 1000 డిస్కౌంట్ లభించనుంది.