
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. రియల్‌మీ 13 ప్రో సిరీస్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. అధునాతన ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లోని తీసుకొస్తున్నారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి..? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రియల్‌మీ 13 ప్రో సిరీస్‌లో ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అల్ట్రా క్లియర్ కెమెరాను అందించారు. సోనీ ఎల్వైటీ 701తో వస్తున్న ప్రంచంలోనే తొలి ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇందులో రియల్‌మీ 13 ప్రో+, రియల్‌మీ 13 ప్రో ఫోన్‌లను లాంచ్ చేయనున్నారు.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సోనీ ఎల్వైటీ -701 కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 600 పెరిస్కోప్ కెమెరా విత్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ కేపబిలిటీతో తీసుకొస్తున్నారు. హైపర్ ఇమేజ్ + – త్రీ లేయర్ ఏఐ ఇమేజింగ్ ఆర్కిటెక్చర్ తో ఈ ఫోన్లలో కెమెరా సిస్టమ్‌ను వినూత్నంగా తీసుకొస్తున్నారు.

ఇక కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో ఏఐ ఇమేజింగ్ ఆలగోరిథమ్స్, క్లౌడ్ బేస్డ్ ఏఐ ఇమేజ్ ఎడిటిండ్ సపోర్ట్ చేసే ఫీచర్లను అందించారు. ఏఐ ప్యూర్ బొకెహ్, ఏఐ నాచురల్ స్కిన్ టోన్, ఏఐ అల్ట్రా క్లారిటీ వంటి అధునాతన ఫీచర్లు ఈ ఫోన్ సొంతం.

రియల్‌మీ 13 ప్రో సిరీస్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 80 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5050 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.