Realme Pad X: రియల్‌మీ నుంచి అదిరిపోయే ట్యాబ్లెట్‌.. తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు..

|

May 29, 2022 | 6:30 AM

Realme Pad X: ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ తాజాగా రియల్‌మీ ప్యాడ్‌ ఎక్స్‌ పేరుతో ఓ ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం చైనాలో లాంచ్‌ అయిన ఈ ట్యాబ్లెట్‌ను త్వరలోనే భారత్‌లోకి తీసుకురానున్నారు..

1 / 5
 స్మార్ట్‌ ఫోన్లకు పెట్టింది పేరైన రియల్‌మీ తాజాగా మార్కెట్లోకి కొత్త ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. రియల్‌ మీ ప్యాడ్‌ ఎక్స్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్లెట్‌కు సంబంధించిన ఫీచర్లపై ఓ లుక్కేయండి.

2 / 5
రియల్‌మీ ప్యాడ్‌ ఎక్స్‌లో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 చిప్‌సెట్‌ను అందించారు. అలాగే ఇందులో 2K రిజల్యూషన్‌తో కూడిన 11 ఇంచెస్‌ డిస్‌ప్లేను ఇచచ్చారు.

3 / 5
ఈ ట్యాబ్లెట్‌లో 6GB ర్యామ్‌ అందించారు అయితే ఎక్స్‌పాన్షన్ టెక్నాలజీతో ట్యాబ్లెట్ ర్యామ్ కెపాసిటీని 11GB వరకు పెంచుకోవచ్చు. అలాగే స్టోరేజ్‌ 128GB వరకు ఉండగా మైక్రో ఎస్‌డీ కార్డ్‌ ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

4 / 5
 కెమెరా విషయానికొస్తే ఇందులో 13-మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాను అందించారు. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 8,430mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

5 / 5
ధర విషయానికొస్తే బేస్‌ వేరియంట్‌ అయిన 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర మన కరెన్సీలో రూ. 15,000కాగా, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 18,400 వరకు ఉండొచ్చు.