
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి రియల్‌మీ సీ25వై పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌చేసింది. గతంలో వచ్చిన సీ25 మోడల్‌కి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చారు.

ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది.

కెమెరాకు అధికా ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో రెయిర్ కెమెరా 50 మెగా పిక్సెల్, సెల్ఫీ కోసం 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

ఆక్టాకోర్ యూనిసాక్ టీ610 ప్రాసెసర్‌తో నడిచే ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందిచారు. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

4 జీబీ ర్యామ్/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999 కాగా 4 జీబీ ర్యామ్/128 జీబీ ధర రూ. 11,999గా ఉంది.

సెప్టెంబర్ 20 నుంచి ముందస్తు బుకింగ్స్ ప్రారంభంకానున్నాయి. సెప్టెంబరు 27 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్లలతోపాటు రియల్‌మీ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉండనున్నాయి.