
ప్రస్తుతం మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ సందడి చేస్తోంది. దిగ్గజ సంస్థలన్నీ కొత్త ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రియల్‌మీ 9 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఏప్రిల్ 7 నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

ఈ ఫోన్‌లో 6.6 ఇంచెస్ ఐపీఎస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఈ డిస్‌ప్లే 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4జీ ప్రాసెసర్‌తో పని చేయనుంది.

33 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించారు. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది.

కెమెరా విషయానికొస్తే ఇందులో 108 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తోంది. ఫ్రంట్ కెమెరాకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ బేసిక్ ధర రూ. 15,000గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 7నుంచి ఫ్లిప్ కార్ట్‌లో అందుబాటులోకి రానుంది.