
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ జీటీ 6 పేరుతో గురువారం ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 24వ తేదీ అర్థ రాత్రి 11.50 గంటల వరకు ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ప్రీ ఆర్డర్ బుక్ చేసుకున్న వారికి స్క్రీన్ డ్యామేజీ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు.

ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.40,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.42,999, 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.44,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను ఫ్లూయిడ్ సిల్వర్, రేజర్ గ్రీన్ షేడ్స్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. కొన్ని బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 1000 వరకు బోనస్ పొందొచ్చు. ఇక ఇందులో డాల్బీ విజన్, హెచ్‌డీఆర్ 10+కి సపోర్ట్ చేసే స్క్రీన్‌ను అందించారు.

120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ 8టీ ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్ ప్లే ఈ ఫోన్ సొంతం. 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేటుతోపాటు 6000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను అందించారు. 4ఎన్ఎం క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ ఎల్వైటీ 808 సెన్సర్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 4కే రిజల్యూషన్‌తో వీడయో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక ఇందులో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ కేవలం 28 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అవుతుందని కంపెనీ చెబతోంది.