
ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ల హవా నడుస్తోంది. రోజుకో కొత్త వాచ్ మార్కెట్లో సందడి చేస్తున్న తరుణంలో పీట్రాన్ కొత్త వాచ్‌ను లాంచ్ చేసింది. పీట్రాన్ ఫోర్స్ ఎక్స్ 10 పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.7 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. పవర్‌ఫుల్ బ్రైట్‌నెస్ ఫీచర్‌తో వాచ్ స్క్రీన్ ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

ఆక్సిజన్ లెవల్స్, హార్ట్ రేట్ ట్రాకింగ్ ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

ధర విషయానికొస్తే ఈ వాచ్ రూ. 1499కి అందుబాటులో ఉంది. ఈ వాచ్ అసలు ధర రూ. 5999కాగా ఆఫర్‌లో భాగంగా తక్కువ ధరకు అందిస్తున్నారు.

బ్లూటూత్ కాలింగ్‌తో పాటు బ్లూటూత్ ద్వారా కెమెరాను, మ్యూజిక్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వాచ్‌లో ఐపీ68 రేటింగ్‌తో కూడిన వాటర్ ప్రూఫ్‌ను అందించారు.