Poco F6: పోకో నుంచి లిమిటెడ్ ఎడిషన్‌ ఫోన్‌.. డెడ్‌పూల్ థీమ్‌, స్టన్నింగ్ లుక్స్‌తో..

|

Jul 27, 2024 | 11:17 AM

లిమిటెడ్ ఎడిషన్‌ ఫోన్స్‌.. ఇటీవల టెక్ మార్కెట్లో ఇలాంటి స్మార్ట్ ఫోన్స్‌ సందడి ఎక్కువైంది. దాదాపు అన్ని స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీలు ఇలా లిమిటెడ్‌ ఎడిషన్ ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం పోకో మార్కెట్లోకి కొత్త మోడల్‌ను లాంచ్‌ చేసింది. పోకో ఎఫ్‌6 డెడ్‌పూల్ లిమిటెడ్‌ ఎడిషన్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. పోకో ఎఫ్‌6 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇక ఈ ఫోన్‌ను మార్వెల్ సూపర్‌ హీరో డెడ్‌పూల్‌ థీమ్‌తో డిజైన్‌ చేశారు. కెమెరా చుట్టూ డెడ్‌పూల్‌ లోగోను అందించారు.

2 / 5
కామిక్స్‌, మార్వెల్ మూవీస్‌ ఇష్టపడేవారిని దృష్టిలో పెట్టుకొని ఈ లిమిటెడ్ ఎడిషన్‌ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇప్పటికే లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ అమ్మకాలు ఆగస్టు 7వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో జరగనున్నాయి. ఈ ఫోన్‌ ఫీచర్లు, ధరకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
పోకోఎఫ్‌6 డెడ్పూల్ లిమిటెడ్‌ ఎడిషన్‌ ఫోన్‌ ధర విసయానికొస్తే.. 12జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 33,999గా నిర్ణయించారు. అయితే బ్యాంక్‌ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై రూ. 4వేల డిస్కౌంట్‌తో రూ. 29,999కే సొంతం చేసుకోవచ్చు.

4 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడి అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇస్తున్నారు. 1.5 కే రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది.

5 / 5
ఇక ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 SoC ప్రాసెసర్‌ను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 50 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 90 వాట్స్‌ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.