Smart Watch: ప్రపంచంలో అత్యంత సన్నని బ్లూటూత్ కాలింగ్‌ స్మార్ట్‌ వాచ్‌.. ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే..

|

Feb 29, 2024 | 10:21 PM

ఒకప్పుడు వాచ్‌ అంటే కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగించే గ్యాడ్జెట్. కానీ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన స్మార్ట్‌ వాచ్‌లతో చేయలేని పని అంటూ లేదు. అధునాతన ఫీచర్లతో కూడిన వాచ్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పెబల్ కంపెనీ కొత్త వాచ్‌ను లాంచ్‌ చేస్తోంది. పెబల్ రాయల్‌ పేరుతో ఈ కొత్త స్మార్ట్‌ వాచ్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..

1 / 5
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం పెబల్‌ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. పెబల్‌ రాయల్ పేరుతో తీసుకొస్తున్న ఈ వాచ్‌ ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ వాచ్‌ అని కంపెనీ చెబుతోంది.

2 / 5
బ్లూటూత్‌ కాలింగ్ ఫీచర్‌తో పనిచేనున్న ఈ స్మార్ట్ వాచ్‌లో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ డయల్‌ను ఇవ్వనున్నారు. ఈ వాచ్‌ మొత్తం బాడీ థిక్‌నెక్‌ కేవలం 6 ఎమ్‌ఎమ్‌ కావడం విశేషం. ఇక ఈ వాచ్‌లో 1.43 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు.

3 / 5
 ఇక ఈ వాచ్‌లో అల్ట్రా వైడ్‌ కలర్‌ గాముట్‌, సూపర్ వైడ్‌ వ్యూయింగ్ యాంగిల్‌, ఆల్వేస్‌ ఆన్‌ డిస్‌ప్లే సపోర్ట్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ వాచ్‌లో ఇన్‌బుల్ట్‌గా వాయిస్‌ అసిస్టెంట్‌ను అందించనున్నారు.

4 / 5
ఈ స్మార్ట్ వాచ్‌లో అలారమ్‌, కాలుక్యులేటర్‌, స్లీప్‌ మానిటరింగ్‌, హార్ట్ రేట్, ఎస్‌పీఓ2 వంటి ఫీచర్లను అందించనున్నారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 5 రోజులు పనిచేస్తుంది.

5 / 5
ఈ స్మార్ట్‌ వాచ్‌ కేవలం 40 గ్రాములు మాత్రమే ఉంటుంది. అలాగే ఈ వాచ్‌ను విస్కీ బ్రౌన్‌, పైన్‌ గ్రీన్‌, కోబాల్ట్ బ్లూ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ధర విషయానికొస్తే ఈ వాచ్‌ ధర రూ. 4,299గా నిర్ణయించారు.