
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఒప్పో ఎఫ్ 23 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఫ్రెండ్లీ బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో మంచి ఫీచర్లను అందించారు.

ఒప్పో ఎఫ్ 23 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 120హెర్జ్స్ రీఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. రిజొల్యూషన్ రేటు 2400×1080 పిక్సెల్స్ విత్ 580 నిట్స్ బ్రైట్‌నెస్‌గా ఉంది.

క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌తో తీసుకొచ్చారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 67 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 5జీ, 4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, యూఎస్బీ టైప్ సీ ఫర్ చార్జింగ్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇచ్చారు. ధర విషయానికొస్తే రూ. 24,999గా ఉండనుంది.