Oppo K12x 5G: రూ. 10వేలలో సూపర్ ఫీచర్స్‌.. మహిళలు మెచ్చే కలర్‌లో కొత్త వేరియంట్‌

|

Sep 24, 2024 | 1:14 PM

స్మార్ట్‌ ఫోన్స్‌లో ఫీచర్లను మాత్రమే కాకుండా ఫోన్‌ కలర్‌ను కూడా దృష్టిలో పెట్టుకునే వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మహిళలకు పింక్‌ కలర్‌ ఫేవరేట్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ ఒప్పో మార్కెట్లోకి కొత్త ఫీన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో కే12ఎక్స్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో కే12ఎక్స్‌ పేరుతో ఈ 5జీ ఫోన్‌ను ఇది వరకే తీసుకొచ్చారు. అయితే తాజాగా ఈ ఫోన్‌లో కొత్త కలర్‌ వేరియంట్‌తో తీసుకొచ్చారు. ఫీథర్‌ పింక్‌ కలర్‌లో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు.

2 / 5
రెండు నెలల క్రితం భారత మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌ను ప్రస్తుతం ఫీథర్‌ పింక్‌ కలర్‌లో తీసుకొచ్చారు. త్వరలో జరగనున్న ఫ్లిప్‌ కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి సేల్స్‌ ప్రారంభంకానున్నాయి.

3 / 5
ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్ పై పని చేస్తుంది. మిలిటరీ -గ్రేడ్ ఎంఐఎల్ ఎస్టీడీ-810హెచ్ డ్యూరబిలిటీ ఈ ఫోన్‌ సొంతం. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఓఎస్‌ వర్షన్‌తో పనిచేస్తుంది.

4 / 5
ఇక ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 720×1604 పిక్సెల్స్ ఈ స్క్రీన్‌ సొంతం. బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 45 వాట్స్‌ సూపర్ వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5100 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

5 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ 6 జీబీ ర్యామ్‌, 18 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 12,999కాగా సేల్‌లో భాగంగా రూ. 10,999కి లభించనుంది.