
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. ఒప్పో వాచ్ ఫ్రీ పేరుతో లాంచ్ చేసిన ఈ వాచ్ ఫీచర్లు, ధర విషయానికొస్తే..

ఈ స్మార్ట్ వాచ్‌లో 1.75 ఇంచెస్ 2.5డీ క్వార్డ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 100కిపై స్పోర్ట్స్ మోడల్స్‌కు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుం

ఆండ్రాయిడ్ 6.0 వెర్షన్ లేదా తర్వాత వెర్షన్లకు పనిచేసే స్మార్ట్ ఫోన్లకు ఈ వాచ్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ ఈ వాచ్ ప్రత్యేకత.

ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ వాచ్ రూ. 5,999కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్‌ను బ్లూటూత్ 5.0తో మీ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

బ్యాటరీకి అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌లో 230 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో నడవనుంది. ఈ స్మార్ట్ వాచ్‌ను 5 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 24 గంటల బ్యాకప్ పొందవచ్చు. ఇక ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 14 రోజులు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.