
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో ఏ 76 పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి..

ఈ ఫోన్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేశౄరు. ధర విషయానికొస్తే 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ రూ. 17,499కాగా, 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ ధర రూ. 19,999గా ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 90 హెడ్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 6.56 ఇంచెస్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు.

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.