చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో తాజాగా తన మొదటి మడతపెట్టే స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను వచ్చే నెలలో విడుదల చేయనున్నారు.
Oppo Find N 5Gపేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. నెట్టింట లీకైన సమాచారం ప్రకారం కొన్ని ఫీచర్లు హల్చల్ చేస్తున్నాయి. అవేంటంటే..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7.8 నుంచి 8 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇందలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు.
కెమెరాకు అధికా ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ సెల్ఫీ స్నాపర్ పాప్ అప్ కెమెరాను తీసుకొచ్చారు.
ఇక ఈ ఫోన్‌లో 64w ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీనితో పాటు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించనున్నారు.