Oppo Find N: ఒప్పో నుంచి తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయో తెలుసా.?

| Edited By: Ravi Kiran

Dec 14, 2021 | 7:05 AM

Oppo Find N: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఒప్పో తాజాగా మార్కెట్లోకి తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. డిసెంబర్‌ 15న ప్రకటన చేయనున్న ఈ ఫోన్‌ ఫీచర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..

1 / 5
స్మార్ట్‌ఫోన్‌ తయారీలో వస్తోన్న విప్తవాత్మక మార్పుల్లో ఫోల్డబుల్‌ ఫోన్‌లు ఒకటి. అన్ని ప్రముఖ కంపెనీలు ఫోల్డబుల్‌ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒప్పో కూడా తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌ను పరిచయం చేయనుంది.

2 / 5
ఒప్పో ఫైండ్‌ ఎన్‌ పేరుతో తీసుకురానున్న ఈ స్మా్ర్ట్‌ఫోన్‌ ఫీచర్లు నెట్టింట లీక్‌ అయ్యాయి. డిసెంబర్‌ 15న విడుదల చేయనున్న ఈ ఫోన్‌ ఫీచర్లు ఇలా ఉండనున్నాయి. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ను అందించనున్నారు.

3 / 5
ఈ ఫోన్‌లో 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన మెయిన్‌ స్క్రీన్‌ను అందించనున్నారు. ఈ ఫోన్‌లో 33 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో కూడిన 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు 32 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఉండనుంది.

5 / 5
ఈ ఫోన్‌ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో లభించనుంది. 8 జీబీ ర్యామ్​ + 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్​ + 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ మోడల్ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.