OnePlus Nord 3: వన్‌ప్లస్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. నార్డ్‌3పై భారీ డిస్కౌంట్‌..

|

Jan 09, 2024 | 11:42 PM

మొదట్లో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వచ్చిన వన్‌ప్లస్‌. ఆ తర్వాత బడ్జెట్‌ ధరలో ఫోన్‌లను తీసుకొచ్చింది. ఇలా గతేడాది వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 పేరుతో ఓ మిడ్‌ రేంజ్‌ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై వన్‌ప్లస్‌ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? డిస్కౌంట్‌ ఎంత లభిస్తుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. వీటిలో 8 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌ ఒకటి కాగా, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ఫోన్‌ ఒకటి. ఈ ఫోన్‌ను మిస్టీ గ్రీన్, టెంపెస్ట్ గ్రే కలర్స్‌లో తీసుకొచ్చారు.

2 / 5
ఇక డిస్కౌంట్‌ విషయానికొస్తే.. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ లాంచింగ్ ధర రూ.33,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా.. రూ.29,999కి సొంతం చేసుకోవచ్చు. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ లాంచింగ్ ధర రూ. 37,999 కాగా ప్రస్తుతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 33,999కి సొంతం చేసుకోవచ్చు.

3 / 5
వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 ఫీచర్ల విషయానికొస్తే.. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేసే ఈ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ను అందించారు. 6.74 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. హెచ్‌డీఆర్10+కు ఈ స్మార్ట్‌ ఫోన్‌ సపోర్ట్‌ చేయనుంది.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. దీంతో పాటు సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 80 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సోపర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

5 / 5
ఇక కనెక్టివిటీ ఫీచర్స్‌ విషయానికొస్తే.. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌ వంటి ఫీచర్లను అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌లో అందించారు.