
వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 56,999కాగా ఈ ఫోన్‌పై గతంలో రూ. 2000 డిస్కౌంట్ ప్రకటించారు. ఇక తాజాగా కంపెనీ మరోసారి రూ. 3000 డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 51,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఇక పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కోనుగోలు చేస్తే అదనంంగా రూ. 3000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ సైతం పొందొచ్చు.

వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ ప్రాసెసర్‌ను అందించారు. అలాగే ఈ ఫోన్‌లో సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 6.7 ఇంచెస్‌తో కూడిన క్వాడ్ హెచ్‌డీ+ ఈ ఫోన్ సొంతం.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. 10-బిట్ ఎల్టీపీఓ 3.0 అమోలెడ్ డిస్ ప్లే ఈ ఫోన్ సొంతం. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. సోనీ ఐఎంఎక్స్ 471 సెన్సర్ కెమెరాను అందించారు.

సెక్యూరిటీ కోసం ఈ స్మార్ట్ ఫోన్‌లో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, అలర్ట్ స్లైడర్ వంటి ఆప్షన్స్‌ను అందించారు. ఇక కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, యూఎస్బీ 2.0 టైప్ సీ కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.