
చైనీస్ కంపెనీ OnePlus భారతదేశంలో రెండు కొత్త మోనిటర్లను విడుదల చేసింది. అవి OnePlus X 27, OnePlus E 24. వీటి ధరలు, డిస్‌ప్లేలు, ఫీచర్‌లు, స్పెక్స్, మరిన్నింటి మధ్య పోలికను ఇక్కడ తెలుసుకుందాం.. OnePlus X 27 ధర రూ.27,999. డిసెంబర్ 15 నుంచి దీని కోసం సేల్ ప్రారంభమవుతుంది. అయితే OnePlus ఇంకా OnePlus Monitor E 24 ధరను వెల్లడించలేదు.

27 అంగుళాల స్క్రీన్‌తో వస్తున్న OnePlus X 27.. 2560*1140 రిజల్యూషన్‌ను ఇస్తుంది. ఇది 165 hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఇది ఫ్లికర్-ఫ్రీ, తక్కువ బ్లూ లైట్ కోసం TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది.

OnePlus E 24 స్క్రీన్ పరిమాణం 24 అంగుళాలు. ఇది 75 hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1920*1080 (FHD) రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఇది తక్కువ బ్లూ లైట్, యాంటీ గ్లేర్‌తో ఫ్లికర్-ఫ్రీని కలిగి ఉంటుంది.

USB-C కనెక్టివిటీ, HDMI, DP, హెడ్‌ఫోన్ జాక్‌లను కూడా OnePlus X 27 అందిస్తుంది.

OnePlus Monitor E 24.. HDMI ప్లస్ హెడ్‌ఫోన్ జాక్‌తో USB-C కనెక్టివిటీని కలిగి ఉంది.

OnePlus X 27 గేమ్, పిక్చర్, మూవీ మోడ్‌ల కోసం అడాప్టివ్ సింక్, పిక్చర్ మోడ్‌ను కలిగి ఉంటుంది. మానిటర్ E 24కి అందుబాటులో లేని స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్‌ను కూడా ఇది కలిగి ఉంది.

OnePlus Monitor E 24 బ్లాక్ స్టెబిలైజర్, స్టాండర్డ్ మోడ్, మూవీ మోడ్, గేమ్ మోడ్ ఇంకా అడాప్టివ్ సింక్‌తో కూడిన పిక్చర్ మోడ్‌ను కలిగి ఉంటుంది. ఇది తక్కువ బ్లూ లైట్ కోసం TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌ను కలిగిన ఈ మోనిటర్ మీ కళ్ళకు సౌకర్యంగా ఉంటుంది.