
నథింగ్ కంపెనీ ఏప్రిల్ 18వ తేదీన ఈ ఇయర్ బడ్స్‌ను తీసుకొస్తున్నారు. వీటికి సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట నథింగ్ ఇయర్ (ఎ)కి సంబంధించి కొన్ని ఫీచర్లు లీక్ అవుతున్నాయి.

నెట్టింట వైరల్ అవుతోన్న ఫీచర్ల ప్రకారం నథింగ్ ఇయర్ (ఎ)లో 45డీబీ వరకు నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ చేస్తుంది. ఇది వరకు వచ్చిన ఇయర్ (2)తో పోల్చితే 5 డీబీ ఎక్కువగా ఉండడం విశేషం.

ధర విషయానికొస్తే నథింగ్ ఈయర్ (ఏ) ఇయర్ బడ్స్ సుమారు 150 డాలర్లు ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. మన కరెన్సీలో చెప్పాలంటే ఈ ఇయర్ బడ్స్ ధర రూ. 12వేలు ఉండొచ్చని చెబుతున్నారు.

ఇక ఈ ఇయర్ బడ్స్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 7.5 గంటల ప్లేబ్యాక్‌తో పనిచేస్తుంది. ఇయర్ బడ్స్ కేస్‌తో 33 గంటలు లైఫ్ టైమ్ ఇస్తుంది. ఇందులో యూఎస్‌బీ సీ పోర్ట్‌తో తీసుకొచ్చారు.

నథింగ్ ఈయర్ (ఏ) ఇయర్ బడ్స్‌లో ఐపీ54 వాటర్ ప్రూఫ్ రేటింగ్‌తో తీసుకొచ్చారు. అలాగే దీనిని క్విక్ ఛార్జింగ్ ఫీచర్‌ను అందించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఇయర్ బడ్స్‌పై డిస్కౌంట్ అందించనున్నారు