
నాయిస్ వీ106 పేరుతో తీసుకొచ్చిన ఈ ఇయర్ బడ్స్‌ను ట్రూ వైర్‌లెస్ స్టీరియో టెక్నాలతో రూపొందించారు. అన్ని ఈ కామర్స్ సైట్స్‌లో అందుబాటులో ఉన్న ఈ ఇయర్ బడ్స్ ఖరీదు రూ. 1299గా ఉంది.

ఈ ఇయర్ బడ్స్‌ను కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు ఏకంగా 200 నిమిషాలు ప్లేటైమ్‌ను అందిస్తుంది. 10ఎమ్‌ఎమ్ డ్రైవర్‌ను అందించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

నాయిస్ వీ106లో హైపర్ సింక్ టెక్నాలజీతో కూడిన బ్లూటూత్ 5.3 కనెక్టివిటీని అందించారు. గేమ్స్ కోసం ప్రత్యేకంగా గేమింగ్ మోడ్‌ను అందించారు.

ఇక యూజర్లకు బెస్ట్ సౌండ్ క్వాలిటీ అందించడంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ క్వాడ్ మైక్ సిస్టమ్, ఈఎన్‌సీ ఫీచర్‌ను ఇచ్చారు. ఈ ఇయర్ బడ్స్ సిరి, గూగుల్ అసిస్టెంట్‌లకు సోపర్ట్ చేస్తుంది.

యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌ను అందించారు. వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీఎక్స్5 రేటింగ్‌ను అందించారు. చార్జింగ్ కేస్‌తో కలిపి చార్జ్‌పై మొత్తం 50 గంటల ప్లేటైమ్‌ను అందిస్తాయి.