Noise colorfit ore: నాయిస్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్.. ధర ఎంతంటే..
ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌వాచ్‌లు సందడి చేస్తున్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన వాచ్‌లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం నాయిస్ మార్కెట్లోకి కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Noise
Follow us on
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం నాయిస్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. నాయిస్ కలర్‌ఫిట్ ఓర్ పేరుతో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు. ఈ వాచ్‌లో 2.1 ఇంచెస్‌తో కూడిన అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు.
ఈ వాచ్‌ను అల్ట్రా థిన్ బెజెల్స్‌తో డిజైన్ చేశారు. ఈ వాచ్ 100కి పైగా క్లౌడ్ ఆధారిత సేవలను అందిస్తోంది. 600 నిట్స్ బ్రైట్నెస్ ఈ వాచ్ స్క్రీన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.
ఇక కనెక్టివిటీ విషయానికొస్తే.. బ్లూటూత్ 5.3 వెర్షన్ సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే నాన్‌స్టాప్‌గా 7 రోజులు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. మెటాలిక్ కేసింగ్తోపాటు.. లెదర్, సిలికాన్, మెటల్ బ్యాండ్స్‌ను అందించారు.
ఇక ఈ వాచ్‌లో ప్రత్యేకంగా ఇన్నర్ బిల్ట్ మైక్రో స్కోప్ట్రూ సింక్ టెక్నాలజీని అందించారు. దీంతో ఈ వాచ్‌తో కాల్స్ మాట్లాడుకోవచ్చు. వాచ్ బ్లూటూత్ పరిది 18 మీటర్లు ఉంటుంది.
అలాగే ఈ వాచ్‌లో స్లీప్ ట్రాకింగ్, ఆక్సిజన్ మానిటరింగ్, ఎస్పీఓ2 వంటి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లను అందించారు. స్ట్రెస్ మానిటరింగ్, ఉమెన్ సైకిల్ ట్రాకర్లతో తీసుకొచ్చిన ఈ వాచ్ ధర రూ. 2,999గా నిర్ణియించారు.