
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ నాయిస్ తాజాగా కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. కలర్ ఫిట్ పల్స్ బజ్ పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్ జూన్ 8న సేల్ ప్రారంభమైన ఈ వాచ్ ధర రూ. 3,999కి అందుబాటులో ఉంది.

ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫంక్షనాలిటీ, SpO2 ట్రాకింగ్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్, హార్ట్ రేట్ సెన్సార్ మానిటర్ వంటివి అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజులు పనిచేస్తుంది.

ఈ స్మార్ట్‌వాచ్‌లో 240 x 280 పిక్సెల్స్ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేసే 1.69 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. బ్లూటూత్ 5.1 కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.

ఇందులో 150 కంటే ఎక్కువ క్లౌడ్ బేస్డ్ కస్టమైజ్డ్ వాచ్ ఫేస్‌లను అందించారు. బ్లూటూత్ సపోర్ట్‌తో ఫోన్‌కు కనెస్ట్ చేస్తే.. వాచ్ సాయంతో వాయిస్ కాల్స్ స్వీకరించవచ్చు.

స్మార్ట్‌వాచ్ నుంచి ఫోన్ మ్యూజిక్, కెమెరాను కూడా కంట్రోల్ చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ వాటర్ రెసిస్టెంట్‌తో అందించారు.