
Noise Buds Verve: తక్కువ బడ్జెత్‌తో అద్భుతమైన ఫీచర్లు కలిగిన బడ్స్‌ని కోరుకునే కస్టమర్ల కోసం నాయిస్ కంపెనీ తన నాయిస్ బడ్స్ వెర్వ్‌ని భారత్‌లో విడుదల చేసింది. దీనిలో ప్రధానంగా చెప్పుకోవాల్సినది బ్యాటరీ లైఫ్. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 45 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తాయని నాయిస్ కంపెని ప్రకటించింది.

భారత్‌లో నాయిస్ బడ్స్ వెర్వ్ ధర: నాయిస్ కంపెనీ భారత్‌లో విడుదల చేసిన నాయిస్ బడ్స్ వెర్వ్ ధర రూ.1119. ఇక ఈ బడ్స్‌ని అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

నాయిస్ బడ్స్ వెర్వ్ ఫీచర్లు: ఈ బడ్స్ డిజైన్ గురించి చెప్పుకోవాలంటే.. ఇవి సిలికాన్ ఇయర్ టిప్స్‌తో వచ్చే ఇన్-ఇయర్ డిజైన్ కలిగి ఉన్నాయి. క్రోమ్ ఫినిషింగ్ కారణంగా ఈ బడ్స్ ప్రీమియం, స్టైలిష్ లుక్‌ను కూడా అందిస్తాయి.

అంతేకాక ఇందులో క్వాడ్ మైక్రోఫోన్‌లతో ENC సపోర్ట్ ఉంది. 10mm డ్రైవర్‌తో వస్తున్న ఈ బడ్స్‌లో మీరు 40ms లో లేటెన్సీతో పాటు వాటర్ రెసెస్టెన్సీ కోసం IPX5 రేటింగ్ పొందుతారు.

చాలా తక్కువ ధరకే వస్తున్న ఈ ఇయర్‌బడ్స్‌లో మీరు ఇన్‌స్టాఛార్జ్ టెక్నాలజీ సపోర్ట్‌ను పొందుతారు. ఎలా అంటే వీటిని మీరు కేవలం 10 నిమిషాల ఛార్జ్ చేస్తే 150 నిమిషాల వరకు ప్లేబ్యాక్ టైమ్‌ని అందిస్తాయి. అంతేకాక ఇవి ఫుల్ చార్జ్‌పై 45 గంటల బ్యాటరీ లైఫ్‌ని కలిగి ఉన్నాయి.