Moto Edge 30: ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసిన మోటొరోలా.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

|

May 10, 2022 | 5:56 PM

Moto Edge 30: మోటొరోలా స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లో మరో సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మోటో ఎడ్జ్‌ 30 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ మే12 భారత మార్కట్లోకి రానుంది..

1 / 5
ఇటీవల వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న మోటొరోలా తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటో ఎడ్స్‌ 30 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రస్తుతం యూరప్‌లో అందుబాటులోకి రాగా మే 12న భారత్‌ మార్కెట్లోకి రానుంది.

2 / 5
ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ 6.79mm మందం, 155 గ్రాముల బరువు మాత్రమే ఉండడం విశేషం. ఇక ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 778జీ+ ప్రాసెసర్‌తో పనిచేయనుంది.

3 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్‌లో 33 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 4020 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
గరిష్టంగా 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
ఇక ధర విషయానికొస్తే భారత్‌లో ఈ ఫోన్‌ ధర ఎంతో అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ యూరోపియన్‌ మార్కెట్లో మాత్రం 450 ఈయూఆర్‌ వద్ద ఉంది. అంటే ఈ లెక్కన భారత్‌లో రూ. 30,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.