
వరుసగా కొత్త ఫోన్లను లాంచ్ చేస్తోన్న మోటోరోలా తాజాగా మోటో ఈ 30 పేరుతో మరో స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్‌ను రూపొందించారు.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ మ్యాక్స్ విజన్ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది.

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో నడిచే ఈ ఫోన్ ఆక్టాకోర్ యూనిసోక్ టీ700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌ను అందించారు.

ఇక ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ను రూ.10,200గా ఈ నిర్ణయించారు. ప్రస్తుతం కొలంబియా, స్లొకోవియాలో దక్షిణ అమెరికా దేశాల్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ త్వరాలనే భారత్‌లో లాంచ్ కానుంది.

ఇక కెమెరా విషయానికొస్తే 48 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీకోసం 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది.