Moto G14: మరో రెండు కొత్త కలర్స్‌లో మోటో జీ14.. రూ. పది వేలకే ఇన్ని ఫీచర్స్‌ ఏంటి అసలు

|

Aug 24, 2023 | 5:11 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ మోటరోలా ప్రస్తుతం బడ్జెట్‌ స్మార్ట్ ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా తీసుకొచ్చిందే మోటీ జీ 14. ఆగస్టులో మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ ఫోన్స్‌ హాట్‌ కేక్స్‌లా అమ్ముడుపోయాయి. దీనికి కారణం.. ఈ ఫోన్ ధరే. కేవలం రూ. 10 వేలలో మంచి ఫీచర్స్‌తో తీసుకురావడంతో యూజర్లు పెద్ద ఎత్తున ఈ ఫోన్‌కు అట్రాక్ట్ అయ్యారు. దీంతో కంపెనీ కూడా యూజర్లను మరింత అట్రాక్ట్ చేసే క్రమంలో తాజాగా ఈ ఫోన్‌ను మరో రెండు కొత్త కలర్స్‌లో తీసుకొచ్చింది. మరి ఈ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 5
మోటరోలా ఈ నెల ప్రారంభంలో మోటో జీ 14 స్మార్ట్ ఫోన్‌ను స్టీల్ గ్రే, స్కై బ్లూ ఆప్షన్స్‌లో తీసుకొచ్చింది. అయితే తాజాగా బటర్‌ క్రీమ్‌, పాలెలిలాక్‌ కలర్స్‌లో తీసుకువచ్చింది. ఆగస్టు 24వ తేదీ నుంచి ఈ కొత్త ఫోన్స్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చాయి.

2 / 5
ఇక ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే మోటీ జీ14 4జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 9,999కి అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది.

3 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 20 వాట్స్‌ టర్బో పవర్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్‌ను ఇచ్చారు.

4 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ + డిస్‌ప్లేను ఇచ్చారు. 1080×2400 పిక్సెల్స్‌ ఎల్సీడీ డిస్ ప్లే విత్ 405 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఈ స్క్రీన్ ప్రత్యేకత. ఇక ఈ ఫోన్‌ అక్టాకోర్‌ యూనిసోక్ టీ616 ఎస్వోసీ చిప్‌సెట్‌తో రన్ చేస్తుంది.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఇందులో 50 మెగా పిక్సెల్‌ రెయిర్ కెమెరాను అందించారు. క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ వంటి స్పెషల్‌ ఫీచర్స్‌ను ఇచ్చారు. సెల్ఫీల కోసం 2 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.