మైక్రోసాఫ్ట్ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఎలాంటిది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు మనం వాడే అన్ని ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే నడుస్తాయి.
మైక్రోసాఫ్ట్ అందిస్తోన్న సాఫ్ట్‌వేర్‌లను యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఎక్సెల్‌లో ఆకట్టుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది మైక్రోసాఫ్ట్. ఎన్నో రోజులుగా యూజర్లు కోరుకుంటున్న ఈ ఫీచర్‌ను యాడ్ చేసింది.
మైక్రోసాఫ్ట్ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఎక్సెల్‌లో హైపర్ లింక్ ఆప్షన్ తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్‌తో ఇకపై స్ప్రెడ్‌షీట్‌లో వర్క్ చేసేప్పుడు సంబంధిత సమాచారానికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం వెబ్ లింక్‌ను లింక్ చేసే అవకాశం లభించనుంది.
దీంతో యూజర్లు సమాచారాన్ని మరింత సులువుగా పొందొచ్చు. ఇక మైక్రోసాఫ్ట్ ఈ ఫీచర్‌ను ఫిబ్రవరి 2022లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనుంది.