
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎంఐ తాజాగా ఎంఐ బ్యాండ్ 7 పేరుతో కొత్త బ్యాండ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ బ్యాండ్ త్వరలోనే భారత్‌లోకి రానుంది.

ఈ బ్యాండ్‌లో 1.62 ఇంచెస్ ఫుల్ ఆమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 100కుపైగా కస్టమైజబుల్ బ్యాండ్ ఫేఎస్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఇక ఇందులో హార్ట్‌రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ SpO2, ఒత్తిడిని కొలిచే స్ట్రైస్ మానిటరింగ్ హెల్త్ వంటి అధునాతన ఫీచర్లు అందించారు.

ఈ బ్యాండ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 14 రోజుల పాటు నిరంతరాయంగా నడుస్తుంది. అంతేకాకుండా 5ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తోంది.

ధర విషయానికొస్తే ఈ బ్యాండ్ ధర చైనాలో 249 యువాన్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 2,900గా ఉంది.