Meta Ray Ban Glasses: మెటా నుంచి స్మార్ట్ గ్లాసెస్‌.. వీడియోలు లైవ్‌ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు

|

Sep 04, 2023 | 7:39 AM

మారుతోన్న టెక్నాలజీ అనుగుణంగా ఆవిష్కరణల్లోనూ మార్పులు వస్తున్నాయి. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త వస్తువులు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో రకాల అడ్వాన్స్‌డ్‌ గ్యాడ్జెట్స్‌ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అప్పటి వరకు సాధారణంగా కనిపించిన వస్తువులు కూడా స్మార్ట్‌గా మారి మళ్లీ మన ముందుకు వస్తున్నాయి. తాజాగా ఫేస్‌ బుక్‌ మాతృ సంస్థ ఇలాంటి ఓ స్టన్నింగ్ ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చే పనిలో పడింది. ఇంతకీ ఏంటా ప్రొడక్ట్‌, దాని ఫీచర్స్‌ ఏంటంటే..

1 / 5
ఫేస్‌ బుక్‌ మాతృ సంస్థ మెటా.. స్మార్ట్ గ్లాసెస్‌ తయారీలో పడింది. ప్రముఖ కళ్ల జోళ్ల సంస్థ రే-బాన్‌ సహకారంతో మెటా ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను తయారు చేసే పనిలో పడింది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి ఫస్ట్ జనరేషన్‌ రేబాన్‌ స్మార్ట్‌గ్లాస్‌లు లాంచ్‌ కాగా ఇప్పుడు సెకండ్‌ జనరేషన్‌ గ్లాసెస్‌ను తీసుకురానున్నాయి.

2 / 5
చూడ్డానికి సాధారణ ఐ గ్లాసెస్‌ల కనిపించినా ఇవి పూర్తిగా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో రూపొందించినవి. సౌండ్‌, కెమెరా వంటి ఎన్నో అధునాతన ఫీచర్స్‌ ఈ స్మార్ట్‌ గ్లాసెస్‌ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.

3 / 5
 ఈ స్మార్ట్‌ గ్లాసెస్‌ ద్వారా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి వీడియోలను లైవ్‌లో వీక్షించే వెసులుబాటు ఉంటుంది. వీడియోలను కళ్ల ముందే చూస్తున్న అనుభూతిని పొందొచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

4 / 5
స్మార్ట్ గ్లాసెస్‌ నుంచి సౌండ్‌ బయటకు వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే స్టీరియో స్పీకర్‌లను అమర్చడం ద్వారా బ్లూటూత్ హెడ్‌సెట్‌ మాదిరిగా కూడా సౌండ్ వినే ఏర్పాట్లు చేశారు.

5 / 5
 అంతేకాకుండా ఈ గ్లాసెస్‌కు ఏర్పాటు చేసిన కెమెరా ద్వారా మన ముందు జరుగుతున్న వాటిని రికార్డ్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంది. స్మార్ట్ గ్లాసెస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ధర లాంటి విషయాలను త్వరలోనే ప్రకటించనున్నారు.