WhatsApp New Feature: మరో కొత్త ఫీచర్‌ను యాడ్‌ చేసిన వాట్సాప్‌.. ఇకపై గ్రూప్‌ వీడియో కాల్స్‌లో ఎప్పుడైనా..

| Edited By: Ravi Kiran

Jul 20, 2021 | 7:44 AM

WhatsApp New Feature: కరోనా నేపథ్యంలో వీడియో కాల్స్‌కు బాగా ఆదరణ పెరిగింది. ముఖ్యంగా ఉద్యోగులు గ్రూప్‌ వీడియో కాల్స్‌తో సమాచారాన్ని పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్‌ గ్రూప్‌ వీడియో కాల్స్‌లో మరో కొత్త ఫీచర్‌ను జోడించింది. దీని ద్వారా..

1 / 6
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ ఫీచర్లను జోడిస్తుంటుంది వాట్సాప్‌. అందుకే ఇంతటి పోటీలోనూ ఈ మెసేజింగ్‌ సైట్‌కు ఇంత ఆదరణ లభిస్తోంది.

2 / 6
 తాజాగా కరోనా నేపథ్యంలో గ్రూప్‌ వీడియో కాల్స్‌కు ప్రాధాన్యత పెరిగిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్‌ వీడియో కాల్స్‌ ఉపయోగించుకుంటున్న వారి కోసం వాట్సాప్‌ కొత్తగా మరో ఫీచర్‌ను యాడ్‌ చేసింది వాట్సాప్‌.

3 / 6
సాధారణంగా ఎవరైనా మనల్ని గ్రూప్‌ కాల్‌కు ఇన్వైట్‌ చేసిన సమయంలో మనం కాల్‌ లిఫ్ట్‌ చేయకపోతే.. అప్పటికే ప్రారంభమైన వీడియో సెషన్‌లో మనకు పాల్గొనే అవకాశం ఉండదు.

4 / 6
దీనికి చెక్‌ పెట్టడానకే వాట్సాప్‌ 'జాయినబుల్ కాల్స్‌' అనే ఫీచర్‌ను సోమవారం నుంచి యాడ్‌ చేసింది. దీంతో యూజర్లు ఏ సమయంలోనైనా గ్రూప్‌ కాల్స్‌లో జాయిన్‌ కావొచ్చు.

5 / 6
 ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ ఫౌండర్‌ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ అధికారికంగా తెలిపారు. వాట్సాప్‌లో జాయినబుల్‌ కాల్స్‌ ఫీచర్‌ను తీసుకొచ్చామని తెలుపుతూ.. ఇకపై గ్రూప్‌ వీడియో కాల్‌లో మిస్‌ అయిన వారు ఎప్పుడైనా జాయిన్‌ అవ్వొచ్చు అంటూ పోస్ట్‌ చేశారు.

6 / 6
దీంతో పాటు కాల్‌ ఇన్ఫో స్క్రీన్‌ అనే ఆప్షన్‌ను కూడా తీసుకొచ్చారు. దీనిద్వారా అప్పటికే గ్రూప్‌ కాల్‌లో ఎవరెవరు ఉన్నారు, మిమ్మల్ని వీడియోకాల్‌కు ఎవరు ఇన్వైట్‌ చేశారన్న విషయాలను తెలుసుకోవచ్చు.