ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ల వినియోగం బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే పరిమితమైన వాచ్‌తో ఇప్పుడు అన్ని పనులు చేసేస్తున్నాం. దీంతో అన్ని కంపెనీలు ఈ వాచ్‌ల తయారీలోకి దిగుతున్నాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ మాక్సిమా భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. మ్యాక్స్ ప్రో ఎక్స్6 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 3,999 నుంచి ప్రారంభమవుతుంది.
ఇందులో రియల్‌టెక్ RTL8762D చిప్‌సెట్‌ను అందించారు. ఇది బ్లూటూత్ v5.0 ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. iOS 9.0 లేదా ఆండ్రాయిడ్ 5.0.. అంతకంటే ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఉన్న డివైజ్‌లకు అనుసంధానించవచ్చు.
మ్యాక్స్ ప్రొ ఎక్స్6 స్మార్ట్ వాచ్‌లో 1.7 ఇంచెస్ సూపర్ బ్రైట్ హెచ్‌డీ స్క్రీన్‌ను ఇచ్చారు. ఎండ వెలుతురులో కూడా స్పష్టమైన డిస్‌ప్లే కనిపించడం ఈ వాచ్ ప్రత్యేకత. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఈ స్మార్ట్ వాచ్ మరో ప్రత్యేకత.
ఇక అన్ని స్మార్ట్ వాచ్‌లలో ఉంటోన్న హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఎపీఓ2, హార్ట్ రేట్ మానిటర్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.