Nokia C32: బడ్జెట్‌ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? రూ. 6500కే మంచి ఫీచర్లు..

|

Mar 11, 2024 | 7:26 PM

తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్‌కోసం చూస్తున్నారా.? అయితే మీకోసమే ఈ బెస్ట్‌ డీల్‌. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం నోకియా గత కొన్ని రోజుల క్రితం నోకియా సీ32 పేరుతో ఓ ఫోన్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫోన్‌పై మంచి ఆఫర్‌ లభిస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
Nokia C32 Priceనోకియా సీ 32 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 6.499కాగా, 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 6,999, 6జీబీ ర్యామ్‌,  128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 7,999గా నిర్ణయించారు.

2 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

3 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 3 రోజులు పాటు పనిచేస్తుంది. ఏఐ పవర్డ్‌ బ్యాటరీ సేవింగ్ ఫీచర్‌ను ఇందులో అందించారు. ఐపీ52 ప్రొటెక్షన్‌తో తీసుకొచ్చారు.

4 / 5
ఇక సెక్యూరిటీ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను అందించారు. ఈ ఫోన్‌పై ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందించారు. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 7500 వరకు డిస్కౌంట్‌పు పొందొచ్చు.

5 / 5
ఇక ఈ ఫోన్‌లో బ్లూటూత్‌, సెల్యూలర్‌, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. 720పీ రిజల్యూషన్‌ స్క్రీన్‌ ఈ ఫోన్‌ సొంతం. ఈ ఫోన్‌లో కెమెరా కోసం ప్రత్యేకంగా నైట్‌మోడ్‌ ఆప్షన్‌ను అందించారు.