
iQOO Z7 5G: రూ. 20 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్స్‌లో ఐకూ జెడ్7 ఫోన్ ఒకటి. ఈ ఫోన్ ధర రూ. 18,999గా ఉంది. ఇందులో 6.38 ఇంచెస్ డిస్‌ప్లేను ఇచ్చారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్‌లో 64 ఎంపీ రెయిర్ కెమెరాతోపాటు, సెల్ఫీల కోసం రూ. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.

Moto G82 5G: మోటోరోలాకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 19,999గా ఉంది. ఈ ఫోన్‌లో 6.60 ఇంచెస్ డిస్‌ప్లేను ఇచ్చారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 965 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఇందులో 50 ఎంపీ రెయిర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.

OnePlus Nord CE 2 Lite 5G: రూ. 20 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ 5జీ ఫోన్స్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.59 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 64 ఎంపీ రెయిర్ కెమెరాతో పాటు, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. ధర విషయానికొస్తే రూ. 18,499గా ఉంది.

OnePlus Nord CE 3 Lite 5G: వన్‌ప్లస్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 19,999గా ఉంది. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.72 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 108 ఎంపీ రెయిర్ కెమెరాతో పాటు, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.

Vivo T2 5G: రూ. 20 వేలలోపు అందుబాటులో ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్స్‌లో వివో టీ2 స్మార్ట్ ఫోన్ ఒకటి. ఈ ఫోన్ ధర రూ. 18,999గా ఉంది. ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.38 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం. కెమెరా విషయానికొస్తే ఇందులో 64 ఎంపీ రెయిర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు.