LG QNED: ఈ టీవీ ధర రూ. 2 లక్షల పైమాటే.. ఫీచర్స్ అలా ఉంటాయి మరి

Updated on: Jan 26, 2024 | 9:47 PM

ప్రస్తుతం హై ఎండ్‌ స్మార్ట్‌ టీవీలకు భారీగా ఆదరణ లభిస్తోంది. ఇంట్లోనే హోం థియేటర్‌ కల్చర్‌ వచ్చిన నాటి నుంచి పెద్ద స్క్రీన్‌ టీవలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఎల్‌జీ మార్కెట్లోకి హై ఎండ్‌ లగ్జరీ స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది. ఈ టీవీ ధర ఏకంగా రూ. 2 లక్షలపైమాటే. ఇంతకీ టీవీలో...

1 / 5
దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఎల్‌జీ భారత మార్కెట్లోకి కొత్త ప్రీమియం స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది. ఎల్‌జీ క్యూఎన్‌ఈడీ 83 సిరీస్‌ పేరుతో ఈ స్మార్ట్‌ టీవీని బుధవారం భారత మార్కెట్లోకి విడదుల చేశారు.

2 / 5
ఈ సిరీస్‌లో భాగంగా 65 ఇంచెస్‌, 55 ఇంచెస్‌తో కూడిన రెండు టీవీలను లాంచ్‌ చేశారు. ధర విషయానికొస్తే 65 ఇంచెస్‌ టీవీ ధర రూ. 2,19,990కాగా, 55 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ ధర రూ. 1,59,990గా నిర్ణయించారు.

3 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ టీవీలో క్వాంటమ్ డాట్, నానోసెల్ అనే ప్రత్యేక టెక్నాలజీని అందిస్తున్నారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, డాల్బీ విజన్, ఆట్మోస్‌తో విజువల్ వండర్‌గా ఈ స్మార్ట్‌ టీవీని తీసుకొచ్చారు.

4 / 5
ఎల్‌జీ క్యూఎన్ఈడీ స్మార్ట్‌ టీవీలో 4కే రిజల్యూషన్‌తో డిస్‌ప్లేతో స్మార్ట్ డిమ్మింగ్ టెక్నాలజీని అందించారు. దీంతో  దీంతో వీక్షకులు మరింత సహజమైన రంగుల్లో టీవలను వీక్షించవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

5 / 5
ఇక ఈ స్మార్ట్‌ టీవీని గేమింగ్‌ కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. గేమ్ డ్యాష్‌బోర్డ్, ఆప్టిమైజర్‌ను సపోర్ట్ చేయడం ఈ టీవీ ప్రత్యేకత. నెట్‌ఫ్లిక్స్, యాపిల్ టీవీ ప్లస్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ప్రైమ్ విడియో లాంటి ఓటీటీ ప్లాంట్‌ఫామ్‌లకు సపోర్ట్ చేస్తుంది.